మల్కాగ్‌గిరిని మరో నోయిడా చేస్తా!

ప్రజల తరఫు పార్లమెంటులో గళం వినిపిస్తా: రేవంత్‌రెడ్డి

revanth reddy
revanth reddy

హైదరాబాద్‌: తెలంగాణలో సియం కేసిఆర్‌కు ప్రజలు ఇచ్చిన అధికారంతో కుటుంబ పాలన చేస్తున్నారని, అందుకే లోక్‌సభ ఎనఇ్నకల్లో టిఆర్‌ఎస్‌కు తగిన బుధ్ది చెప్పారని మల్కాజ్‌గిరి ఎంపిగా గెలుపొందిన కాంగ్రెస్‌నేత రేవంత్‌రెడ్డి అన్నారు. తండ్రీకొడుకుల అహంకారం అణిచేందుకే ప్రజలు ఈ విధమైన ఫలితాలు ఇచ్చిరని చెప్పారు. రాష్ట్ర విభజన హక్కులపై పార్లమెంటులో ప్రజల తరఫున గళమెత్తుతానని చెప్పారు. ఈ గెలుపులో తన ప్రమేయం కంటే తెలంగాణ సాధించుకున్న విద్యార్ధుల పాత్రే ఎక్కువగా ఉందని చెప్పారు. విభజన హామీల అమలుతో పాటు తెలంగాణకు రావాల్సిన జతీయ ప్రాజెక్టులు, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలు, ఉక్కు కర్మాగారం, ఖమ్మంలో గిరిజన వరిసటీ తదితర అంశాలపైనే తాను పార్లమెంటులో లేవనెత్తుతానని అన్నారు. మల్కాజ్‌గిరిని మరో నోయిడాగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/