రేవంత్ మరో ఛాలెంజ్ విసిరి..కేసీఆర్ ను ఇరకాటంలో పెట్టాడు

రేవంత్ మరో ఛాలెంజ్ విసిరి..కేసీఆర్ ను ఇరకాటంలో పెట్టాడు

కేటీఆర్ – రేవంత్ రెడ్డి ల మధ్య సవాళ్లు , ప్రతిసవాళ్లు నడుస్తున్నాయి. ట్విట్టర్ వేదికగా వీరిద్దరూ వరుస సవాల్ చేసుకుంటున్నారు. వైట్ ఛాలెంజ్‌ను సిద్ధమా?.. అంటూ రేవంత్ రెడ్డి..కేటీఆర్ కు సవాల్ విసిరితే..తాను ఏ పరీక్షకైనా సిద్ధంగానే ఉన్నానని, ఓటుకు నోటు కేసులో రేవంత్ లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసాడు. ఇక ఇప్పుడు రేవంత్ మరో సవాల్ విసిరారు.

కేటీఆర్ సవాలును తాను స్వీకరిస్తున్నానని, లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నట్లు తెలుపుతూ.. అయితే తనతో పాటు కేసీఆర్ కూడా సహారా కుంభకోణం, ఈఎస్ఐ కుంభకోణం, సీబీఐ కేసుల్లో లై డిటెక్టర్ టెస్ట్‌లకు వస్తారా? అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్ తో సీఎం కేసీఆర్‌ను కూడా ఇరికించారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ అగ్రనేతలపై మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు ఇప్పుడు రాష్ట్రంలో చర్చ గా మారాయి.