ఇంటర్‌ బోర్డు ఎదుట రేవంత్‌, సంపత్‌ల ధర్నా, అరెస్టు

revanth reddy, sampath kumar
revanth reddy, sampath kumar

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ బోర్డు ఎదుట కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు ధర్నా చేపట్టారు. విద్యార్ధులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ఐతే పోలీసులు రేవంత్‌, సంపత్‌లను అరెస్టు చేసి బేగంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మరోవైపు ఇంటర్‌ బోర్డు ఆఫీసు ముట్టడికి ఏబివిపి కార్యకర్తలు యత్నించారు. ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఇంటర్‌ బోర్డు వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. తమకు జరిగిన అన్యాయంపై అధికారులు స్పందించాలని విద్యార్ధులు డిమాండ్‌ చేస్తున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/