మైహోం రామేశ్వర్‌రావుపై రేవంత్‌ రెడ్డి పిటిషన్‌

నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు ఎంపి

Revanth Reddy
Revanth Reddy

హైదరాబాద్‌: మై హోం సంస్థ యజమాని రామేశ్వర్‌ రావుకు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ షాకిచ్చింది. ఆ సంస్థకు చేసిన భూ కేటాయింపులపై హైకోర్టు లో కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. రాయదుర్గంలో వందలకోట్లు విలువచేసే భూమిని మైహోమ్ కు కేటాయించరని పిల్‌లో ఆయన పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రూ. 38 కోట్ల స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారన్నారు రేవంత్ రెడ్డి . ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రామేశ్వర్ రావు తో పాటు, ప్రభుత్వానికి, దీలినీ సంస్థకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 4 వారాలపాటు కేసును వాయిదా వేసింది న్యాయస్థానం.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/