రేవంత్ సెటిల్మెంట్లు, కబ్జాలకు పనికొస్తాడు

Bodakunta Venkateshwar
Bodakunta Venkateshwarlu

హైదరాబాద్‌: ఎంపి రేవంత్ రెడ్డి రాజకీయాలకు పనికి రారని ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఈరోజు బోడకుంటి మీడియాతో మాట్లాడారు. రేవంత్ సెటిల్మెంట్లు, కబ్జాలకు పనికొస్తాడని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావు చాలా సమర్ధమైన వ్యక్తి అని, సిఎం కెసిఆర్ నాయకత్వంలో ప్రభాకర్ రావు అద్భుతంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తుంటే కాంగ్రెస్ వాళ్లకు నచ్చడం లేదన్నారు. సిఎం కెసిఆర్, జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావులపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వెంకటేశ్వర్లు హెచ్చరించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/