రేవంత్ ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్న పోలీసులు

నేడు కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమం జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు , కార్య కర్తలు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. రాష్ట్రంలో ఉన్న రైతుల‌ను అంద‌రికీ వ‌రి వేస్తే ఉరే అని చెప్పిన సీఎం కేసీఆర్ 150 ఎక‌రాల్లో వ‌రి పండిస్తున్నార‌ని రేవంత్ రెడ్డి అన్నారు. కాగ‌ కేసీఆర్ వ‌రి వేసిన పొలాన్ని ఈ రోజు జ‌రిగే రచ్చ‌బండ కార్యాక్ర‌మంలో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చూపిస్తాన‌ని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఈ తరుణంలో రేవంత్ ఇంటి దగ్గర అర్థరాత్రి నుంచే పోలీసులు పహారా కాశారు. రేవంత్ రెడ్డి బయటకు రాకుండా చూస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. రచ్చబండకు వెళ్తున్న పలువురి కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. రచ్చబండ కార్యక్రమానికి జగిత్యాల నుంచి వెళ్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అడ్డుకుని గృహ నిర్భంధం చేశారు పోలీసులు. దుబ్బాకలో ఆరుగురు, భూపాలపల్లిలో ఐదుగురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్ధిపేటలో పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉంటె కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి మ‌రోసారి రేవంత్ రెడ్డి పై ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. అంతే కాకుండా తాను ర‌చ్చబండ కార్యాక్ర‌మానికి రాను అని తెల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి ర‌చ్చ‌బండ చేసేది ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా అని.. ఇక్క‌డి నుంచి తను ఒక్కిరినే ఎమ్మెల్యేగా ఉన్న అని అన్నారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలిపారు. త‌న‌కు స‌మాచారం ఇవ్వ‌కుండా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కార్యాక్ర‌మం ప్ర‌క‌టించార‌ని అన్నారు.