కెసిఆర్‌ అరాచక పాలన చేస్తున్నారు

revanth reddy
revanth reddy

హైదరాబాద్‌: ఎమ్మెల్యెల కొనుగోలును చూడలేకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యె శ్రీశైలం గౌడ్‌ను రేవంత్‌ ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌ సొంత పార్టీ నాయకులను హీనంగా చూస్తూ ప్రత్యర్థి పార్టీల నుంచి నేతలను కొనుగోలు చేస్తున్నారని ఆయన అన్నారు.పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్ల ప్రజలకు ఏమైనా ప్రయోజనముందా? అని ప్రశ్నించారు. పదవి కోసం తాను పని చేయట్లేదని, పార్టీ కోసమే కష్టపడుతున్నానని స్పష్టం చేశారు. కెసిఆర్‌ మొదటిసారి గెలిచాక రాష్ట్రంలో నియంతృత్వ పాలన చేశారు. రెండో సారి ఎన్నికయ్యాక అరాచక పాలన చేస్తున్నారు. ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయొద్దనేలా కేసీఆర్‌ ప్రవర్తిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశించాం. కానీ పరిహాసం చేస్తున్నారు. ఈ ఎన్నికలు
బిజెపి వర్సెస్‌ కాంగ్రెస్‌గా, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నాయి. అని రేవంత్‌ రెడ్డి అన్నారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/