మునుగోడు ఉపఎన్నిక చర్చ తప్పుడు దారిలో పోతుంది – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో అన్ని పార్టీలు ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నాయి. మునుగోడు లో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉండడంతో ఎలాగైనా మరోసారి గెలిచి తీరాలని కాంగ్రెస్ భావిస్తుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఉప ఎన్నిక ప్రచారం తప్పుడు దారిలో పోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన రేవంత్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నికపై స్పందించారు. మునుగోడు ఉపఎన్నిక చర్చ తప్పుడు దారిలో పోతోందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ వైఫల్యాలపై జరగకుండా వ్యక్తిగత దూషణలపై చర్చ జరగడం బాధాకరమన్నారు. ప్రజా సమస్యలపై కాకుండా వ్యక్తిగత దూషణలపై జరుగుతోందని అన్నారు. మరోసారి మునుగోడు ప్రజలను మోసం చేసేందుకు బీజేపీ, టిఆర్ఎస్ యత్నిస్తున్నాయని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ వైఫల్యాలపై ఈ ఎన్నికల్లో చర్చ జరగాలన్నారు.