కోకాపేట్​, ఖానామెట్​ భూముల అమ్మకాలపై సీబీఐ డైరెక్టర్​ను కలిసిన రేవంత్

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ..దిల్లీలో సీబీఐ డైరెక్టర్ ను కలిశారు. కోకాపేట్​, ఖానామెట్​ భూముల అమ్మకాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన పిర్యాదు చేసారు. భూముల అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్ర ఖజానాకు రూ. వెయ్యి నుంచి 1,500 కోట్ల నష్టం జరిగిందని రేవంత్​ ఆరోపించారు.

కోకాపేట్​, ఖానామెట్​ భూముల టెండర్లలో గోల్​మాల్​ జరిగింది. దీనికి సహకరించిన అందరిపైన రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను. భాజపా, తెరాస కుమ్మక్కయ్యాయి అనేది నిజం కాకపోతే.. భూముల అమ్మకాలపై సీబీఐ చేత విచారణ జరిపించి.. చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రేవంత్ మీడియా ద్వారా సవాల్ విసిరారు. మొదటి నుండి కూడా రేవంత్ కోకాపేట్​, ఖానామెట్​ భూముల అమ్మకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు రాహుల్ గాంధీ తో సమావేశమై ..ఆ తర్వాత సీబీఐ డైరెక్టర్ కు పిర్యాదు చేయడం జరిగింది.