కేంద్ర కేబినెట్​ విస్తరణపై స్పందించిన రేవంత్

ఒక్కరే తెలుగు వ్యక్తికి అవకాశం ఇచ్చారన్న టీపీసీసీ చీఫ్

హైదరాబాద్ : రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జరిగిన కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై ఆయన విమర్శలు గుప్పించారు. యూపీఏ హయాంలో తెలుగు వారికి దక్కిన ప్రాతినిధ్యాన్ని, ఇప్పుడు ఎన్డీయే ఇచ్చిన ప్రాధాన్యాన్ని పోల్చారు.

పదేళ్ల యూపీఏ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 10 మంది తెలుగు వారికి కేంద్ర కేబినెట్ లో మంత్రులుగా అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంలో కేవలం ఒక్కరికే ఆ అవకాశం దక్కిందని విమర్శించారు. తమ సామర్థ్యాన్ని బీజేపీ అధినాయకత్వం విశ్వసించనందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు సిగ్గుపడాలని అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/