ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన రేవంత్‌ రెడ్డి

Revanth Reddy
Revanth Reddy

హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసి సమ్మె 52 రోజులపాటు సాగింది. అయితే సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు కార్మికులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా కార్మికులను విధులకు రానివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటున్న విషయంపై స్పందించిన కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ విమర్శించారు. నియంతృత్వం, దుర్మార్గ పాలనకు పరాకాష్ఠగా ప్రభుత్వం మారిందన్నారు. ఇంకా ఎంత మంది చనిపోతే మీ రక్తదాహం తీరుతుంది? చనిపోయిన ముప్పై మంది కార్మికుల కుటుంబాల ఉసురు తగులుతుందని అన్నారు. ఆర్టీసి కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/