విశ్రాంత జ‌స్టిస్ సుభాష‌ణ్‌రెడ్డి క‌న్నుమూత‌

subhashan reddy
subhashan reddy

హైద‌రాబాద్ః విశ్రాంత జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 76 ఏళ్లు. గత నెల రోజులుగా నగరంలోని గచ్చిబౌలీలో ఉన్న ఏషియన్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చికిత్స పొందుతున్న ఆయన.. బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన గతంలో మద్రాస్, కేరళ హైకోర్టుల చీఫ్ జస్టిస్ గాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త తొలి చైర్మన్‌ గానూ సుభాషణ్ రెడ్డి సేవలందించారు. సుభాషణ్‌ రెడ్డి భౌతికకాయాన్ని అవంతి నగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. ఇవాళ సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. సుభాషణ్‌ రెడ్డికి ముగ్గురు కుమారులు.

తాజా ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్ వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/