చంద్రబాబు నివాసం వద్ద పోలీసుల ఆంక్షలు
నారా లోకేష్ టిడిపి కార్యలయానికి వెళ్లకుండా ముళ్లకంచెలు, బారికేడ్లు ఏర్పాటు

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి నివాసం వద్ద ఉద్రిక్త నెలకొంది. ఆయన కుమారుడు నారా లోకేష్ టిడిపి కార్యాలయానికి వెళ్లకుండా ఆయన వెళ్లే మార్గంలో ముళ్ల కంచెలు, బారికేడ్లు, రోప్‌లు పెట్టారు. చంద్రబాబు నాయుడి ఇంటి నుంచి ఎవరూ అమరావతి వైపు వెళ్లకుండా పోలీసు బలగాలను మోహరించారు. రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం సెక్షన్ 144, 30ని అమలు చేస్తున్నారు. మరోవైపు ఇవాళ చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం పరిసరాల్లో సైతం సెక్షన్ 144ను అమలు చేస్తున్నారు. ప్రజలెవరూ గుమిగూడి ఉండవద్దని రేణిగుంట తహసీల్డార్ విజయ సింహారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు తిరపతిలో చంద్రబాబు తలపెట్టిన పరిరక్షణ సమితి ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/