సీఏఏ రద్దుకు పంజాబ్‌ అసెంబ్లీ ఆమోద ముద్ర

సీఏఏ వల్ల దేశవ్యాప్తంగా మరియు పంజాబ్‌లోనూ నిరసనలు చోటుచేసుకున్నాయి

Amarinder Singh
Amarinder Singh

చండీగఢ్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్‌ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించింది. ఈ మేరకు సీఏఏను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ అధికార కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన తీర్మానానికి పంజాబ్‌ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ఈ తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. సీఏఏ వల్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. పంజాబ్‌లోనూ నిరసనలు చోటుచేసుకున్నాయని అన్నారు. అందుకే ఈ చట్ట సవరణను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం అని తీర్మానం సందర్భంగా అమరీందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. కాగా గత నెలలో కేరళ ప్రభుత్వం కూడా పౌరసత్వం సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానానికి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. శాసనసభలో ఈ తీర్మానాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రవేశపెట్టగా ఆ రాష్ట్ర శాసన సభ్యులంతా ఆమోద ముద్ర వేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/