రాజీనామాలపై ఈరోజే తుదినిర్ణయం తీసుకోవాలి

14 Karnataka MLAs
14 Karnataka MLAs

న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయం మరోమలుపు తిరిగింది. అసమ్మతి ఎమ్మెల్యెల పిటిషన్‌పననై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఎమ్మెల్యెల రాజీనామాలపై ఈరోజు తుదినిర్ణయం తీసుకోవాలంటూ కర్నాటక అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీం ఆదేశించింది. సాయంత్రం 6 గంటలకల్లా స్పీకర్‌ను కలుసుకోవాలంటూ కాంగ్రెస్జేడీఎస్ కూటమికి చెందిన 10 మంది రెబల్ ఎమ్మెల్యేలను సుప్రీం ఆదేశించింది. కావాలనుకుంటే మళ్లీ రాజీనామాలు సమర్పించవచ్చునని సూచించింది. అసమ్మతి ఎమ్మెల్యేలకు తగిన భద్రత కల్పించాలని కూడా కర్నాటక డీజీపీని ధర్మాసనం ఆదేశించింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/