థెరిస్సామే మంత్రులు రాజీనామా

THERISSA MAY
THERISSA MAY

బ్రెగ్జిట్‌ ముసాయిదాపై ఉవ్వెత్తున ఎగిసిన నిరసన
లండన్‌: యూరోపియన్‌ కూటమినుంచి వైదొలిగే ప్రక్రియలోభాగంగా ప్రధాన మంత్రి థెరిస్సామే తన ముసాయిదా ప్రతిని ఆమోదింపచేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. బ్రెగ్జిట్‌మంత్రి ఇతర మంత్రులు ఈ డీల్‌ను వ్యతిరేకిస్తూ మంత్రివర్గంనుంచి వైదొలగడంతో బ్రిటన్‌లో అశాంతికి దారితీసింది. ఈ కొత్త డీల్‌ వల్లబ్రిటన్‌ యూరోపియన్‌ బ్లాక్‌లో ఏళ్లతరబడి కొనసాగాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బ్రెగ్జిట్‌ మంత్రి డొమినిక్‌ రాబ్‌, వర్క్‌ పింఛన్ల మంత్రి ఈస్తర్‌ మెక్‌వే, జూనియర్‌ ఉత్తర ఐర్లాండ్‌ మంత్రి శూలేష్‌ వారా, జూనియర్‌ బ్రెగ్జిట్‌మంత్రి స్యూయెల్లా బ్రేవర్‌మాన్‌లు బ్రిటన్‌మంత్రివర్గంనుంచి వైదొలుగుతున్నట్లుప్రకటించారు. దీనితో థెరిస్సామే తన ముసాయిదా డీల్‌ను పార్లమెంటులో ఆమోదింపచేసుకోవడంలో వైఫల్యం చెందినట్లయింది. బ్రిటన్‌లో నెలకొన్న ఆకస్మికపరిణామాలతో డాలర్‌ పైపైకి దూసుకుపోయింది. ట్రేడర్లు బ్రెగ్జిట్‌డీల్‌ పై నెలకొన్న అనిశ్చితికారనంగా జపాన్‌ వంటి సురక్షితమార్కెట్లవైపు దృష్టిసారించారు. మంత్రివర్గ సభ్యుల రాజీనామాలు స్టెర్లింగ్‌ను మరింత దిగజార్చాయి. ఒకటిశాతానికిపైగా దిగజారింది. యూరోపియన్‌ షేర్లు మాత్రం ముందస్తు లాభాలనుంచి తిరోగమించాయి. ప్రతికూలదిశగా పయనించాయి. ఆటోమొబైల్‌, బ్యాంకింగ్‌స్టాక్స్‌ ఎక్కువ దిగజారాయి. ఇన్వెస్టర్లు బ్రస్సెల్స్‌తో రోమ్‌ ప్రతిష్టంభనపై కూడా ఎక్కువ గురిపెట్టారు. బీజింగ్‌తో వాషింగ్టన్‌ డీల్‌ వ్యవహారంపై కూడా ఇన్వెస్టర్లు ఎక్కువ గురిపెట్టడంతో బ్రిటన్‌షేర్లు మందగమనంతోముగిసాయి. పాన్‌ యూరోపియన్‌ స్టాక్స్‌600 సూచీ 0.5శాతం దిగజారింది. జరకమనీ, స్పానిష్‌, ఫ్రెంచ్‌ మార్కెట్లు ప్రతికూలదిశలోనే ముగిసాయి. బ్రిటన్‌ ఎఫ్‌టిఎస్‌సి 100 సూచీ స్థిరంగా ముగిసింది. యూరోపియన్‌ మండలితో తదుపరిచర్చలకోసం సన్నద్ధం అవుతున్నతరుణంలో బ్రెగ్జిట్‌పై ఎలాంటి ఒప్పందం లేకుండానే ముందుకు కొనసాగాల్సి ఉంటుందని వెల్లడించారు. బ్రిటన్‌ హౌస్‌ఆఫ్‌కామన్స్‌తో మాట్లాడుతూ ఎలాంటి డీల్‌ లేకుండా మనం వైదొలగాలి. లేదంటే బ్రెగ్జిట్‌కోసం అనుకూలమైన ఒప్పందం కోసం మనం మరోసారి సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని బ్రిటన్‌ప్రధాని వెల్లడించారు. బ్రెగ్జిట్‌పై ఎలాంటి డీల్‌లేకుండానే ముగించాలని ఇందుకు సానుకూలంగా కృషిజరగాలని ఫ్రెంచ్‌ ప్రధాని ఎడ్వార్డో ఫిలిప్పీ పేర్కొన్నారు. ప్రస్తుత బ్రిటన్‌ రాజకీయ పరిస్థితి మరికొంత అనిశ్చితిని పెంచుతుందని, బ్రెగ్జిట్‌ ఒప్పందంపై సంతకంచేసేందుకు మరికొంత జాప్యం జరుగుతుందన్న ఆందోళనవ్యక్తంచేసారు. ప్రస్తుత డీల్‌తోబ్రిటన్‌ప్రజలకు ఇచ్చిన హామీలను తాము నెరవేర్చలేమన్న భావన కలుగుతున్నదని బ్రెగ్జిట్‌ మంత్రి డొమినిక్‌రాబ్‌ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో మనం ప్రకటించిన మేనిఫెస్టో హామీలనుసైతం గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. ఇదిప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశమని, ఏప్రజాస్వామ్య దేశం కూడా ప్రజల అభిమతానికి భిన్నంగా వెళ్లలేదని అన్నారు. బ్రెగ్జిట్‌అనంతరపరిణామాలనేపథ్యంలో దేశంలోప్రజాస్వామ్య విలువలపై బయటిదేశం నియంత్రణలో కొనసాగడం అప్రజాస్వామికమే అవుతుందని పలువురు మంత్రులు పేర్కొన్నారు. సంక్షేమ మంత్రి ఈస్తర్‌ మెక్‌వే కూడా రాజీనామాచేసారు. 2016నాటి రిఫరెండమ్‌ ఓటును బ్రిటన్‌ ప్రధాని గౌరవించడంలో విఫలం అయ్యారని, యూరోపియన్‌ యూనియన్‌ను వీడాలనే ఆనాటి రిఫరెండమ్‌ ఓటింగ్‌ స్పష్టంచేసిందని పేర్కొన్నారు. ఉత్తర ఐర్లాండ్‌ జూనియర్‌ మంత్రి షైలేష్‌ వారా కూడ ఆమాట్లాడుతూ ముసాయిదాడీల్‌ బ్రిటన్‌ను ఎలాంటి వ్యవధిలేకుండా సందిగ్ధంలో ముంచిందని బ్రిటన్‌ ఎప్పుడు సార్వభౌమదేశంగా ఉంటుందన్న అంశంపై సందిగ్ధత నెలకొన్నదని అన్నారు. బ్రెగ్జిట్‌ జూనియర్‌మంత్రి స్యుయెల్లా వ్రేబర్‌మాన్‌ మాట్లాడుతూ ప్రస్తుతంప్రతిపాదించిన బ్రెగ్జిట్‌ విడాకుల డీల్‌ బ్రిటిష్‌ ప్రజల మనోభావాలకు అనుగుణంగా లేదని యుకెను ఇయునుంచి వేరుపడాలన్న భావనకు వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు. లేబర్‌పార్టీ నేత ప్రతిపక్ష నాయకుడు జెర్మి కార్బిన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతిపాదించిన డీల్‌ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తోందని బ్రెగ్జిట్‌పై అనిశ్చితిని స్పష్టంచేస్తోందని దుయ్యబట్టారు. లేబర్‌పార్టీ నాయకుడు జాన్‌ట్రికెట్‌ మాట్లాడుతూ బ్రెగ్జిట్‌ డీల్‌ను అమలుచేయడంలో ప్రధాని థెరిస్సామే ఘోరంగా విఫలం అయ్యారని కనీసం ఆమె కేబినెట్‌లోసైతం విముఖత వ్యక్తం అవుతున్నదని పేర్కొన్నారు. ఈ డీల్‌పై బ్రిటన్‌ప్రజలు, పార్లమెంటు మరోసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని థెరిస్సామే కల్పించారని విమర్శించారు.