బిజెపికి రాజీనామా చేసిన రేష్మా పటేల్‌

Reshma Patel
Reshma Patel

రాజ్‌కోట్‌: పాటీదార్‌ రిజర్వేషన్‌ అందోళన నాయకురాలు రేష్మా పటేల్‌ బిజెపికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు జీతు వాఘానికి పంపాను. డోల్ల పథకాలను ప్రమోట్‌ చేసే మార్కెటింగ్‌ కంపెనీగా బిజెపిని ఆమె అభివర్ణించారు. అయితే పోర్‌బందర్ పార్లమెంటరీ నియోజవర్గం నుంచి పోటీ చేయాలని కూడా నేను నిర్ణయించుకున్నాను. విపక్షాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి పోర్‌బందర్ సీటుపై వారి వైఖరోమిటో స్పష్టం చేయాలని కోరుతున్నాను. ఇక్కడి నుంచి పోటీకి తనకు అవకాశమిస్తే మహిళా ప్రాతినిధ్యం కూడా పెరుగుతుంది’ అని రేష్మా పటేల్ అన్నారు. అలాంటి నిర్ణయమేదీ తీసుకోని పక్షంలో పోర్‌బందర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి, మనవదర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని చెప్పారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/