మరోసారి ఈఎంఐ మారటోరియం పొడిగించే అవకాశం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఆర్థిక నిపుణులు అంచనా

reserve bank of india
reserve bank of india

మంబయి: లాక్‌డౌన్‌ కారణంగా ఆర్‌బీఐ అన్ని టర్మ్ లోన్ల ఈఎంఐలపై మార్చి 1 నుంచి మే 31 వరకు మూడు నెలల మారటోరియం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఈఎంఐ మారటోరియంను మరో మూడు నెలలు పొడిగించే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్ట్‌లో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ మారటోరియంను జూన్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు ఆర్‌బీఐ పొడిగించే అవకాశం ఉందని ఎస్‌బీఐ భావిస్తోంది. లాక్‌డౌన్ మే 31 వరకు పొడిగించినందున ఆర్‌బీఐ మారటోరియంను మరో మూడు నెలలు పొడిగించే అవకాశం ఉంది. అంటే ఆగస్ట్ 31 వరకు ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు అని ఎస్‌బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిడ్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ రీసెర్చ్ రిపోర్ట్‌లో అభిప్రాయపడ్డారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/