ప్రముఖ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి అరెస్టు

ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ ఆత్మహత్యకేసులో అరెస్టు

ప్రముఖ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి అరెస్టు
arnab-goswami

ముంబయి: రిప‌బ్లిక్ టీవీ సీఈవో అర్న‌బ్ గోస్వామిని ఈరోజు ఉదయం
మహారాష్ట్రలోని అలీబాగ్ పోలీసులు అరెస్టు చేశారు. 53 ఏళ్ల ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ ఆత్మ‌హ‌త్య కేసులో గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. అర్న‌బ్‌ను త‌న ఇంటి నుంచి అలీబాగ్ పోలీసులు అరెస్టు చేసిన‌ట్లు ఓ పోలీసు అధికారి వెల్ల‌డించారు. ఇంట్లో త‌న‌పై పోలీసులు దాడి చేసిన‌ట్లు జ‌ర్న‌లిస్ట్ అర్న‌బ్ ఆరోపించారు. పోలీస్ స్టేష‌న్‌కు తీసుకువెళ్తున్న క్ర‌మంలో అర్న‌బ్‌ను పోలీసు వ్యాన్‌లోకి తోసివేశారు. 2018లో రిప‌బ్లిక్ టీవీ బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో.. ఓ డిజైన‌ర్‌తో పాటు ఆయ‌న త‌ల్లి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. అయితే ఆ ఆర్కిటెక్ట్ కూతురు అద్యా నాయ‌క్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఆ కేసులో విచార‌ణ మొద‌లుపెట్టిన‌ట్లు ఈ ఏడాది మేలో మ‌హారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. అలీబాగ్ పోలీసులు ఆ కేసులో విచార‌ణ స‌రిగా చేపట్ట‌క‌పోవ‌డం వ‌ల్ల త‌న తండ్రి మ‌ర‌ణించిన‌ట్లు అద్యా త‌న ఫిర్యాదులో ఆరోపించింది.


తాజా అంా్జతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/