రిపబ్లిక్ ట్రైలర్ ను విడుదల చేసిన చిరంజీవి

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ,ఐశ్వర్య రాజేశ్ జంటగా ప్రస్థానం ఫేమ్ దేవాకట్టా డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ రిపబ్లిక్. భగవాన్ – పుల్లారావు నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ అక్టోబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసి సినిమా ఫై ఆసక్తి నింపారు.

“సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. ‘రిపబ్లిక్’ చిత్రం అక్టోబర్ 1వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన విడుదలవుతోంది. మీ ఆదరణ .. అభిమానం .. ప్రేమే సాయిధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష” అంటూ చిరంజీవి ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ట్రైలర్ లో ..‘యాజ్ పెర్ కాన్సిటిట్యూషన్ చట్టసభల ఆదేశాల మేరకే .. ఉద్యోగస్తులు పనిచేయాలనే విషయం మరిచిపోయినట్టున్నావ్’ అని రమ్యకృష్ణ అంటే.. ‘యాజ్ పెర్ కాన్స్టిట్యూషన్ చట్టసభల ఆదేశం మారణహోమానికి దారితీస్తే .. ఉద్యోగస్తులు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఫాలో అయితే మీలాంటోళ్ళు హిట్లర్లవుతారు’ అని సాయిధరమ్ కౌంటర్ ఇవ్వడం ఇందులో ప్రధాన హైలైట్. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ శ్రీకాంత్ అయ్యర్ .. ‘గుణని టచ్ చేస్తే విశాఖ వాణి గారిమీద డైరెక్ట్ గా వార్ డిక్లేర్ చేసినట్టే’ అని ఎవరికో వార్నింగివ్వడం కనిపిస్తుంది.

ట్రైలర్ చూస్తుంటే.. రమ్యకృష్ణ ఇందులో చాలా పవర్ ఫుల్ పొలిటీషియన్ గా నటించిందని అర్ధమవుతుంది. ‘మీ భయం , అజ్ఞానం, అమాయకత్వం, విశ్వాసమే ఆ సింహాసనానికి నాలుగుకాళ్ళు’ అంటూ సాయిధరమ్ తేజ్ పాత్ర ప్రజల్ని మోటివేట్ చేసి వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించడాన్ని బట్టి చూస్తే.. రమ్యకృష్ణ పాత్రపై సాయిధరమ్ తేజ్ పోరాటమే ఈ సినిమా ప్రధాన కథాంశం అని చెప్పొచ్చు.

YouTube video