రిపబ్లిక్ డే : ‘ఉగ్ర’టార్గెట్- ప్రముఖులకు ముప్పు! ?

ఇంటెలిజెన్స్ హెచ్చరిక

Republic day parade-file
Republic day parade-file

New Delhi: భారత రిపబ్లిక్ డే రోజు ఉగ్రవాద కదలికలను కనిపెట్టినట్టు ఇంటెలిజెన్స్ తెలిపింది. దీనికి సంబంధించిన తొమ్మిది పేజీల నివేదకను హైలీ సీక్రెట్ గా అందజేసింది. భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రధాని మోడీ, ఇతర ప్రముఖుల ప్రాణాలకు ముప్పు ఉందని ఆ నివేదికలో ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. ఈఏడాది రిపబ్లిక్ వేడుకలకు మధ్య ఆసియా దేశాలైన కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ నేతలను గణతంత్ర వేడుకులకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించే అవకాశం ఉంది.

కాగా, పాకిస్థాన్/ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ ప్రాంతానికి చెందిన గ్రూపుల నుంచి ముప్పు ఉండొచ్చన్న సమాచారం వచ్చిందని ఇంటెలిజెన్స్ పేర్కొంది. ఈ విచ్చిన్నకర శక్తులు అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న ప్రముఖులను లక్ష్యం గా చేసుకుని.. బహిరంగ సభలు, కీలకమైన సమావేశాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో పేలుళ్లు, విధ్వంసాలకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆ నివేదికలో వెల్లడించారు.

తెర -సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/