జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్

హైదరాబాద్: తెలంగాణ భవన్లో 71వ గణతంత్ర దిననోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో మంత్రులు మహముద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన కెటిఆర్‌కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఇక మున్సిపాలిటీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన నేపథ్యంలో కెటిఆర్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/