ప్రతి రోజు ప్రజాప్రతినిధులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సందర్శించాలి

హైదరాబాద్ : మంత్రి హరీష్ రావు ఈరోజు ఉదయం ప్రజాప్రతినిధులతో, పార్టీ ముఖ్యనాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొనాల‌ని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇటీవల రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. నేటి నుండి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి హరీష్ రావు ప్రజాప్రతినిధులకు సూచించారు. జిల్లాలో మొత్తం 412 కొనుగోలు కేంద్రాలున్నాయని, అందులో 225 ఐకేపీ, 10 మార్కెట్ కమిటీ, 187 కో ఆపరేట్ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు.

ఇప్పటికే ధాన్యం ఐకేపీ, మార్కెట్ కేంద్రాల్లోకి రాబోతుందన్నారు. కాబట్టి ఎంపిపిలు, జడ్పిటిసిలు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, కో అపరేట్ చైర్మన్ లు, ప్రజాప్రతినిధులు వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పారు. రైతులకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. అకాల వర్షాలు కురిసిన, గాలి దుమారాలు పెట్టిన రైతులకు ఇబ్బందులు కాకుండా చూడాలని, టార్ఫలిన్ కవర్లు అందుబాటులో ఉండే విధంగా చొరవ చూపాలని కోరారు. ప్రతి రోజు ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాలు సందర్శించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్కోవాలని చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనాలన్నారు. ఆదిశగా ప్రజాప్రతినిధులు పని చేయాలని సూచించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/