దిశ నిందితులకు ప్రారంభమైన రీ పొస్టుమార్టం

Disha-culprits-dead-bodies
Disha-culprits-dead-bodies

హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచార నిందితుల మృతదేహాలకు రీ పొస్టుమార్టం ప్రారంభమైంది. ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం రీ పోస్టుమార్టం చేసేందుకు గాంధీ ఆసుపత్రికి చేరుకుంది. ఈ పోస్టుమార్టంలో ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందంతో పాటు గాంధీ సూపరింటెండెంట్ కూడా పాల్గొననున్నారు. నిందితుల కుటుంబ సభ్యులు సైతం గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. రీ పోస్టుమార్టం మొత్తాన్ని పోలీసులు వీడియో తీయనున్నారు. రీ పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత రిపోర్ట్‌ను షీల్డ్ కవర్‌లో అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను గాంధీ వైద్యుల సమక్షంలో కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించనున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/