ఏపిలో మరో రెండు కేంద్రాల్లో రీపోలింగ్‌

Election Commission
Election Commission

అమరావతి: ఏపిలో ఎన్‌.ఆర్‌.కమ్మపల్లి, పులవర్తివారిపల్లి, కొత్తకండ్రిగ, కమ్మపల్లి, వెంకటరామాపురం కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని ఇటీవలే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో రెండు కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని మరో రెండు కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని తాజాగా ఆదేశించింది. రామచంద్రాపురం మండలంలోని కుప్పం బాదూరు, కాలూరులో ఆదివారం రీపోలింగ్‌ జరగనుంది. అయితే ఈసీ ఈ నిర్ణయంతో రేపు చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం ఏడు కేంద్రాల్లో రీపోలింగ్‌ జరగనుంది.


మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/