వడ్డీరేట్లలో మార్పులు లేవు!

ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి

RBI
RBI

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ ఈరోజు కీలకమైన పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించింది. ఈద్వైమాసికానికి వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకూడదని నిర్ణయించింది. దీంతో రెపోరేటు ప్రస్తుతం ఉన్న 5.15శాతం వద్దే కొనసాగనుంది. మరోవైపు రివర్స్‌ రెపోరేటు 4.90 శాతం వద్ద, బ్యాంక్‌ రేట 5.40శాతం వద్ద కొనసాగుతున్నాయి. అయితే ఆర్‌బీఐ ఈ నిర్ణయం మార్కెట్‌ అంచనాలకు ప్రతికూలంగా ఉండటంతో వెంటనే నష్టాల్లోకి చేరుకున్నాయి. ద్రవ్యోల్బణం 2020-21 రెండో అర్ధ భాగానికి నిర్దేశిత లక్ష్యం కంటే తక్కువగానే ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. కన్జ్యూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ ద్రవ్యోల్బణం 5.1 నుంచి 4.7 శాతంగా ఉండవచ్చని చెప్పింది.  2020-21 తొలి అర్ధ భాగంలో ఇది 4.0 నుంచి 3.8 మధ్య ఉంటుందని అంచనాలు వేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/