త్వరలో హైదరాబాద్ కు షిఫ్ట్

Renuka Desai
Renuka Desai

స్నేహితుల దినోత్సవం నేపథ్యంలో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన రేణు.. ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. తాను త్వరలో హైదరాబాద్ కు షిఫ్ట్ కానున్నట్లు చెప్పారు. పవన్ తో బ్రేకప్ తర్వాత ఏళ్లకు ఏళ్లుగా పూణెలో ఉంటున్న రేణు.. తాను హైదరాబాద్ కు షిఫ్ట్ కావటానికి కారణాల్ని వివరించారు. త్వరలో తాను రైతుల సమస్యల నేపథ్యంలో సినిమా చేయాలని భావిస్తున్నానని.. అందులో భాగంగా తాను హైదరాబాద్ లో ఉండనున్నట్లుగా చెప్పారు. 

ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. దీనికి సంబంధించిన చర్చల కోసం.. ఇతర పనుల కోసం తరచూ ఫూణె నుంచి.. హైదరాబాద్ కు వస్తున్నాని.. తిరగటం ఎక్కువగా ఉండటంతో ఇబ్బందిగా ఉందని.. అందుకే తానుహైదరాబాద్ కు ఏడాది పాటు షిఫ్ట్ కావాలని డిసైడ్ అయినట్లు చెప్పారు. అయితే.. ఎన్ని రోజుల్లో షిఫ్ట్ అవుతారు? అన్న విషయంపై మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు రేణు.