ఎస్సై కాలర్ పట్టుకోవడం ఫై రేణుక చౌదరి క్లారిటీ..

రాహుల్ ఈడీ విచారణ కు నిరసన టి కాంగ్రెస్ ఈరోజు రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాజ్ భవన్ ముట్టడి ఉద్రిక్తత కు దారితీసింది. ఆర్టీసీ బస్సును ధ్వసం చేయడం..రోడ్ల ఫై ఆందోళలన చేయడం, పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం వంటివి చేయడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసారు. ఈ క్రమంలో రేణుక చౌదరి..విధులు నిర్వహిస్తున్న పంజాగుట్ట ఎస్సై చొక్కాను పట్టుకొని వాగ్వాదానికి దిగింది. దీంతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 353 కింద ఆమెపై కేసు నమోదుచేశారు. పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించడంతో పాటు విధి నిర్వాహణకు ఆటంకం కలిగించినందుకు కేసు బుక్ చేసారు.

ఈ ఘటన ఫై రేణుక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. “పోలీసు యూనిఫాం అంటే ఏంటి, ఎలా గౌరవించాలనేది మాకూ తెలుసు. అదే సమయంలో పోలీసులు మాకు కూడా గౌరవం ఇవ్వాలి. నా చుట్టూ ఎందుకు మగ పోలీసులను మోహరించారు? పోలీసులపై దాడి చేయాలని నాకెలాంటి ఉద్దేశం లేదు. నన్ను నెట్టివేసేందుకు ప్రయత్నించడంతో అదుపుతప్పి పోలీసులపై పడిపోయాను. కావాలంటే విజువల్స్ చూడండి.

నన్ను నెట్టివేయడంతో ఆసరా కోసం అతడి భుజాన్ని పట్టుకునే ప్రయత్నం చేశాను… అంతేతప్ప ఉద్దేశపూర్వకంగా అతడి కాలర్ పట్టుకోలేదు. వీడియో చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. దురదృష్టవశాత్తు… తప్పుదోవపట్టించేలా వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ నేతలపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది” అంటూ రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా నేను సదురు ఎస్సైకి సారీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని, కానీ.. ముందుగా నాకు పోలీసులు సారీ చెప్పాలంటూ ఆమె తెలిపింది.