మూడు కంటైన్‌మెంట్‌ జోన్‌ల ఎత్తివేత

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని ఈ మూడు జోన్‌లలో గత పద్నాలుగు రోజులగా నమోదు కాని కరోనా కేసులు

containment zone
containment zone

హైదరాబాద్‌: జిహెచ్‌ఎంసి పరిధిలోని కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో మూడు కంటైన్‌ మెంట్‌ జోన్‌లను అధికారులు ఎత్తివేశారు. కరోనా కేసులు నమోదు అవుతున్న కారణంగా ఏర్పాటు చేసిన కంటైన్‌ మెంట్‌ జోన్‌లలో మూడింటిని ఎత్తివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అపురూప కాలని, మోడీ బిల్డర్స్‌్‌, సుభాష్‌నగర్‌ లలో ఏర్పాటు చేసిన కంటైన్‌ మెంట్‌లలో గత పద్నాలుగు రోజులుగా ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడంతో అధికారులు కంటైన్‌మెంట్‌ జోన్‌ను ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. సిఎస్‌ ఆదేశాలతో ఇక్కడ కంటైన్‌మెంట్‌ను ఎత్తివేశారు. కాగా ఈ మూడు జోన్లలో పోలీసుల సహకారంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/