లాలూకు, బిజెపి ఎంపికి సీఆర్‌పీఎఫ్‌ భద్రత తొలగింపు

Lalu Prasad Yadav
Lalu Prasad Yadav

న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత, బీహర్‌ మాజీ సిఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీకి కల్పిస్తున్న సీఆర్‌పీఎఫ్‌ భద్రతను హోం మంత్రిత్వశాఖ తొలగించింది. కేంద్ర సాయుధ పోలీసు దళాల కింద వీఐపీల భద్రతను హోం శాఖ సోమవారం సమీక్షించి నిర్ణయం తీసుకుంది. కొందరికి కేంద్ర బలగాల భద్రత ఉపసంహరించుకోగా, ఆ స్థానే రాష్ట్ర పోలీసు భద్రత కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా అఖిలేశ్ యాదవ్ కు 2012 నుంచి అత్యాధునిక ఆయుధాలను ధరించిన 22 మంది ఎన్ఎస్జీ కమెండోలు సెక్యూరిటీగా ఉంటున్నారు. ఇప్పుడు ఈ భద్రతను తగ్గించబోతున్నారు.


తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/