వేడి నుంచి ఉపశమనానికి..

ఆరోగ్యం-మహాభాగ్యం

Relief from Heat
Relief from Heat

వేసవిలో హిమోగ్లోబిన్‌ తక్కువ ఉన్నవారు ఎండ వేడిమిని తట్టుకోలేరు. అధిక బరువు ఉన్న వారు బరువు తగ్గించుకోవాల్సి ఉంటుంది.

అదేవిధంగా తక్కువ బరువు ఉన్న వారు కొంత పెరగాలి. లేదంటే ఎండాకాలంలో వడదెబ్బకు గురికావాల్సి ఉంటుంది.

వేసవిలో నూలు దుస్తులు ధరించడం మంచిది. ఎండాకాలంలో అన్నింటికంటే ముఖ్యంగా హైడ్రేట్‌గా ఉండటం.

బయటకు వెళ్లేటప్పుడు మంచినీళ్లు వెంట ఉండేలా చూసుకోవటం మంచిది.

ఉదయం, సాయంత్రం మాత్రమే బయటకు వెళ్లి పనులు చూసుకోవడం మంచిది.

ఎసి గదిలో నుండి బయటికి వచ్చిన తరువాత సాధారణ ఉష్ణోగ్రత్తలో కొంత సేపు ఉండి అప్పుడు బయటకు వెళ్లాలి.

హఠాత్తుగా ఉష్ణోగ్రతలో మారితే రక్తనాళాలు చిట్లే ప్రమాదం ఉంటుంది. అది కంటికి కనిపించకున్నా శరీరానికి నష్టం వాటిల్లుతుంది.

అలాగే బయటి నుండి రాగానే వెంటనే చల్లటి నీళ్లు తాగకూడదు. కొంత సమయం తరువాత తాగాలి. ఎండవేడికి నిమ్మరసంలోని పొటాషియం వడదెబ్బ నుంచి రక్షణనిస్తుంది.

శరీరానికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ కాలంలో తరచుగా పండ్లరసాలు, సూపులు వంటివి తీసుకోవచ్చు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/