ఈ ఫోన్లపై జియో భారీ ఆఫర్‌

OnePlus 7 Series
OnePlus 7 Series

బెంగాళూరు: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వన్‌ప్లస్‌ ఈరోజు భారత్‌లోకి వన్‌ప్లస్‌ 7 సిరీస్‌ మొబైల్స్‌ను విడుదల చేయనుంది. అయితే ఈ సందర్భంగా రిలయన్స్‌ జియో భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ల కొనుగోలుపై రూ.9,300 విలువైన ప్రయోజనాలను వినియోగదారులకు అందించనుంది. వన్‌ప్లస్‌ 7, వన్‌ప్లస్‌7ప్రో స్మార్ట్‌ఫోన్‌లలో జియో నెట్‌వర్క్‌ వినియోగించే వారు రూ.299తో తొలి రీఛార్జ్‌ చేసుకుంటే, వోచర్ల రూపంలో రూ.5,400 ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. రూ.150 విలువైన 36 వోచర్లు మై జియో యాప్‌లోకి వచ్చి చేరతాయి. దీంతో ఆ తర్వాతి నెల నుంచి రూ.149కే ఈ ఫ్లాన్‌ ద్వారా అందే ప్రయోజనాలను వినియోగదారులు పొందవచ్చు. రూ.299 ప్లాన్‌తో రోజుకు 3జీబీ 4జీ డేటా, అపరిమిత కాల్స్‌, మెస్సేజ్‌లను 28రోజుల పాటు అందిస్తోంది. ఇక దీంతో పాటు, రూ.3,900 విలువైన జూమ్‌కార్‌ ప్రయోజనాలు, ఈజీ మై ట్రిప్‌లో విమాన టికెట్లు, హోటల్‌ బుకింగ్స్‌పై రూ.1,550 విలువైన ప్రయోజనాలు, బస్‌ బుకింగ్స్‌పై 15శాతం రాయితీ, చుంబక్‌లో వస్తువుల కొనుగోలుపై రూ.350 డిస్కౌంట్‌ లభించనుంది.


మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/