శ్రీవారిని దర్శంచుకున్న ముఖేష్ అంబానీ..రూ.1.5 కోట్ల విరాళం
శేష వస్త్రం బహూకరించిన ఆలయ వర్గాలు

తిరుమలః తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఈరోజు బ్రేక్ సమయంలో దర్శించుకున్నారు. టిటిడి అర్చక పండితులు ఆయనకు శేష వస్త్రం బహూకరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖేశ్ అంబానీ తిరుమల శ్రీవారికి భారీ విరాళం సమర్పించారు. రూ.1.5 కోట్ల విరాళం తాలూకు చెక్కును ఆయన టిటిడి ఈవో ధర్మారెడ్డికి అందించారు.
అనంతరం ఆయన స్థానిక గోశాలను కూడా సందర్శించారు. కాగా, తిరుమల పర్యటన సందర్భగా ముఖేశ్ అంబానీ వెంట వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలు విజయసాయిరెడ్డి, గురుమూర్తి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/