గృహ నిర్బంధంలో ఉన్న ముగ్గురు నేతల విడుదల

గృహ నిర్బంధంలో ఉన్న ముగ్గురు నేతల  విడుదల
Release of three leaders who are under house arrest

Srinagar: జమ్ము కాశ్మీర్‌లో గృహ నిర్బంధంలో ఉన్న ముగ్గురు నేతలను నేడు రాష్ట్ర పాలనా యంత్రాంగం విడుదల చేయనున్నది. వారినుంచి బాండ్లపై సంతకాలు తీసుకోవడంనుంచి వివిధ అంశాల ఆధారంగా వారిని విడుదల చేయనున్నారు. యావర్‌ మీర్‌, నూర్‌ మొహమ్మద్‌, షోయబ్‌ లోనేలను నిర్బంధంనుంచి విడుదల చేయనున్నారు. పిడిపి నాయకుడైన మీర్‌ రఫియాబాద్‌ శాసనసభ నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే కాగా, లోనె కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆ పార్టీకి రాజీనామా చేశారు. నూర్‌ మొహమ్మద్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కార్యకర్త. ఉగ్రవాద కార్యకలాపాలు అధికంగా జరిగే శ్రీనగర్‌లోని బట్మాలూ ప్రాంతంలో పార్టీ వ్యవహారాలను నూర్‌ నిర్వహించేవాడు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/