వ్యాధిపై అవగాహన కల్పించడానికి వరల్డ్ హైపర్ టెన్షన్ డే

హైదరాబాద్ : వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ 9వేల మందిపై చేసిన సర్వే ఫలితాలను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తాజ్‌ డెక్కన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. వ్యాధిపై అవగాహన కల్పించడానికి ప్రపంచవ్యాప్తంగా హైపర్‌ టెన్షన్‌ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎస్‌ఐ ఇచ్చిన సర్వే ఫలితాలు కొంచెం ఆశ్చర్యంగా, కొంత బాధను కలిగిస్తున్నాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

నిమ్స్‌లో చేసిన సర్వే ప్రకారం.. ఎవరికైతే కిడ్నీ సమస్యలున్నాయో వారిలో 60శాతం మందికి హైపర్‌ టెన్షన్‌ ఉందన్నారు. బీపీని, షుగర్‌ని ముందస్తుగా గుర్తించి.. జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారుతుందన్నారు. జీవనశైలిలో మార్పులతో ఈ సమస్యలు వస్తున్నాయని, ప్రజలు తమ ఆరోగ్యం పట్టించుకోకుండా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఇంతకు ముందు శారీరకంగా శ్రమ ఉండేదని, ఇప్పుడు నో ఫిట్‌నెస్‌ అని, ఆహారం అలవాట్లు బాగా మారిపోయిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ చేస్తున్నామని, 90లక్షల మందికి స్క్రీనింగ్‌ చేస్తే.. తమ స్క్రీనింగ్‌లో 13లక్షల మందికి హైపర్‌ టెన్షన్‌ ఉదన్నారు.

హైదరాబాద్ క్లస్టర్ సీఓఓ డా.రియాజ్ ఖాన్ మాట్లాడుతూ… ఇటీవలి కాలంలో ప్రతిష్టాత్మకమైన వ్యక్తులైన సీఈఓలు, నటులు, రాజకీయ వేత్తలు, క్రీడాకారులు ఇలా చాలా మంది ఆకస్మాత్తుగా మరణించడం చూశామన్నారు. అయితే ఈ అధ్యయన ఫలితాల విశ్లేషణలో వెల్లడైన అంశమేమిటంటే గతంలో హైదరాబాద్ లో 25శాతం మంది మధుమేహ రోగులుంటే ఇప్పుడు వారి సంఖ్య 33శాతంకు చేరుకుందన్నారు. ఐహెచ్ హెచ్ హెల్త్ కేర్ ఇండియా గ్రూప్ సీఈఓ అనురాగ్ యాదవ్ మాట్లాడుతూ… అంతర్జాతీయంగా 20శాతం మంది హైపర్ టెన్షన్ బారిన పడేందుకు అవకాశాలుండగా.. పలు అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం దేశంలో 22శాతం నుంచి 27శాతంగా ఉండొచ్చని చెబుతున్నాయన్నారు. ఈ అధ్యయనంపై హైపర్ టెన్షన్ పట్ల అవగాహనను భారీ స్థాయిలో కల్పించేందుకు ప్రయత్నించనున్నట్లు తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/