శాసన మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి ..గెజిట్ విడుదల చేసిన గవర్నర్

gutha-sukender-reddy

హైదరాబాద్: గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గెజిట్ విడుదల చేశారు. శాసన మండలి చైర్మన్ గా సుఖేందర్ రెడ్డి ఈ నెల 14 న రెండో సారి పదవీ బాధ్యతలను స్వీకరించిన విషయం తెలిసిందే. కాగా, ఈ పదవీకి ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవంగా సుఖేందర్ రెడ్డి ఎన్నికయినట్టు మండలి అధికారులు ప్రకటించారు. 2019 సెప్టెంబర్ 11 న తొలిసారిగా గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తే, 2021 జూన్ మొదటి వరం వరకు తన సేవలు అందించారు. ఆయన పదవీ కాలం ముగియడంతో ,తన స్థానంలో చైర్మన్ గా భూపాల్ రెడ్డి ని ప్రకటించారు. ఆ తర్వాత మండలి చైర్మన్ గా ఎమ్మెల్సీ సయ్యద్ హాసన్ జాఫ్రీ నియమించారు. 2021 లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి రెండో సారి నవంబర్ 22 న ఎన్నికయ్యారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/