సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల విడుదల….

 varun reddy
varun reddy

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం యూపిఎస్‌సి నిర్వహించిన 2018 సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష తుది ఫలితాలను శుక్రవారం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ విడుదల చేసింది. 2018 సెప్టెంబర్‌-అక్టోబర్‌ నెలల మధ్య సివిల్‌ సర్వీసెస్‌ రాతపూర్వక పరీక్షలను యూపిఎస్‌సి నిర్వహించింది. 2019 ఫిబ్రవరి-మార్చి నెలల మధ్య పర్సనాలిటీ టెస్టు కోసం ఇంటర్వ్యూలు జరిగాయి. శుక్రవారం ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో ఐఐటి బొంబాయి గ్రాడ్యుయేట్‌ కనిషక్‌ కతారియా టాపర్‌గా నిలిచాడు. 759మందిలో కనిషక్‌ టాపర్‌గా నిలిచాడు. అక్షిత్‌ జైన్‌ అనే యువకుడు సెకండ్‌ ర్యాంక్‌ సాధించాడు. శృతిజయంత్‌ దేశ్‌ముఖ్‌ 5వ ర్యాంకుతో అమ్మాయిల్లో టాపర్‌గా నిలిచింది. కర్ణాటి వరుణ్‌ రెడ్డి ఏడో ర్యాంకు, అంకితా చౌదరి 14వ ర్యాంకులు సాధించారు. టాప్‌ 25లో 15మంది మగవాళ్లు ఉండగా…10మంది మహిళలున్నారు. ఐఎఎస్‌, ఐపిఎస్‌, సెంట్రల్‌ సర్వీసెస్‌, గ్రూప్‌ ఏ, గ్రూప్‌ బి సర్వీసులకు 759మంది అభ్యర్థులు నియమించబడనున్నారు. వీరిలో 577మంది మగవాళ్లు, 182మంది మహిళలు ఉన్నారు. ఐఎఎస్‌కు 180మంది, ఐఎఫ్‌ఎస్‌కు 30మంది, ఐపిఎస్‌కు 150మంది ఎంపికవగా మిగతావారు సెంట్రల్‌ గ్రూప్‌-ఏ, గ్రూప్‌-బి సర్వీసులకు ఎంపికయ్యారు. అభ్యర్థుల మెరిట్‌ ఆధారంగా వారిని ఆయా పోస్ట్‌లలో వారిని నియమించడం జరుగుతుందని యుపిఎస్‌సి ఒక ప్రకటనలో తెలిపింది.వివిధ విభాగాల్లో 812 పోస్టులకు గాను 759మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సివిల్‌ సర్వీస్‌కు ఎంపికైన అభ్యర్థుల్లో 361మంది జనరల్‌, 209మంది ఓబిసి, 128మంది ఎస్‌సి, 61మంది ఎస్‌టి కేటగిరీలకు చెందిన వారున్నారు. ఫలితాలను యూపిఎస్‌సి అధికారక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పిడిఎఫ్‌ ఫార్మట్‌లో అభ్యర్థుల ఎంపిక జాబితాను అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల రూల్‌ నెంబర్‌తో సహా ఎంపిక జాబితాను యూపిఎస్‌సి ప్రకటించింది.
ఐఎఎస్‌లో టాప్‌ ర్యాంకు సాధించిన కనివాక్‌ కటారియా ఎస్‌సి కేటగిరీకి చెందినవాడు. గణితశాస్త్రాన్ని ఆప్షనల్‌గా ఎంచుకున్నాడు. మహిళల్లో టాపర్‌గా ( సివిల్స్‌ ఐదోర్యాంకు) నిలిచిన శ్రుప్తి జయంత్‌ దేశ్‌ ముక్‌ బోపాల్‌లోని రాజీవ్‌ గాంధీ విశ్వవిద్యాలయంలో కెమికల్‌ ఇంజనీరింగ్‌లో బిఈ చదివారు.
టాప్‌-25 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు…
కనిషక్‌ కటారియా (మొదటి ర్యాంకు), అక్షత్‌ జైన్‌ (రెండో ర్యాంకు), జునైద్‌ అహ్మద్‌ (మూడో ర్యాంకు), శ్రేయాన్స్‌ కుమత్‌ (నాలుగో ర్యాంకు), శ్రుతి జయంత్‌ దేశ్‌ ముఖ్‌ (ఐదో ర్యాంకు), శుభమ్‌ గుప్తా (ఆరో ర్యాంకు), కర్ణాటి వరుణ్‌ రెడ్డి (ఏడో ర్యాంకు), వైశాలి సింగ్‌ (8వ ర్యాంకు), గుంజన్‌ ద్వివేది (9వ ర్యాంకు), తన్మ§్‌ు వశిష్ట శర్మ (10వ ర్యాంకు), పూజ్య ప్రియదర్శిని (11వ ర్యాంకు), నమ్రతా జైన్‌ (12వ ర్యాంకు), వర్ణిత్‌ నేగి (13వ ర్యాంకు), అంకితా చౌదరి (14వ ర్యాంకు), అతిరాగ్‌ చాప్లట్‌ (15వ ర్యాంకు), డి.టి.అంకుశ్‌ (16వ ర్యాంకు), రాహుల్‌ శరణప్ప శంకనూర్‌ (17వ ర్యాంకు), రిషిత్‌ గుప్తా (18వ ర్యాంకు), హర్‌ప్రీత్‌ సింగ్‌ (19వ ర్యాంకు), చిత్రా మిశ్రా (20వ ర్యాంకు), రాహుల్‌ జైన్‌ (21వ ర్యాంకు), దీక్షా జైన్‌ (22వ ర్యాంకు), రిషబ్‌ సి.ఏ (23వ ర్యాంకు), అనురాజ్‌ జైన్‌ (24వ ర్యాంకు), జి.వైభవ్‌ సునీల్‌ (25వ ర్యాంకు).
మిర్యాలగూడ వాసికి సివిల్స్‌ ఏడో ర్యాంకు….
తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంకు చెందిన కర్ణాటి వరుణ్‌ రెడ్డి సివిల్స్‌లో ఆలిండియా స్థాయిలో ఏడో ర్యాంకు సాధించారు. గతంలో 170వ ర్యాంకు సాధించిన వరుణ్‌…ప్రస్తుతం ఐఆర్‌ఎస్‌ శిక్షణలో ఉంటూనే తన ప్రయత్నం మళ్లీ కొనసాగించాడు. జాతీయ స్థాయిలో సత్తా చాటారు. వరుణ్‌ రెడ్డి తండ్రి కర్ణాటి జనార్థన్‌ రెడ్డి మిర్యాలగూడలో ప్రముఖ కంటి వైద్యులు కాగా…వరుణ్‌ తల్లి పోరెడ్డి నాగమణి, మిర్యాలగూడలో వ్యవసాయ శాఖ ఎడిఏగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మరిన్నీ తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/