ధవళేశ్వరం నుంచి లక్షా 90 వేల క్యూసెక్కుల నీరు విడుదల

Dowleswaram Cotton Barrage
Dowleswaram Cotton Barrage


కొవ్వూరు : గోదావరి నది పరివహక ప్రాంతాల్లో ఎగువ నుంచి నీరు అధికంగా నదిలో చేరడంతో ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ నుంచి లక్షా 90 వేల క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు విడుదల చేశారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు వరదనీరు నదిలోకి వచ్చి చేరుతోంది. దీంతో దవళేశ్వరం కాటన్‌బ్యారేజీ వద్ద సోమవారం సాయంత్రం 9.30 అడుగుల నీటి మట్టాన్ని నమోదు చేస్తూ బ్యారేజీకన్నా నాలుగు ఆర్‌ఎంలలోని 175 గేట్లను 40 మీటర్లు పైకెత్తి మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు ప్రధాన డెల్టా కాలువలకు 4,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తూర్పు డెల్టాకు 1000 క్యూసెక్కులు, మధ్యడెల్టాకు 200 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 3 వేల 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు హెడ్‌ వాటర్‌వర్క్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ మోహనరావు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/