మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల

YouTube video
Release of 3rd installment of YSR RYTHU BHAROSA-PM KISAN by Hon’ble CM of AP at CM Camp Office

అమరావతి: సిఎం జగన్‌ వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ మూడో విడత నిధులను మంగళవారం విడుదల చేశారు. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.1,766 కోట్లను జమ చేశారు. నివర్‌ తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) కింద ఇస్తామన్న నిధుల్ని ప్రభుత్వం జమచేసింది. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ మూడోవిడత కింద రూ.1,120 కోట్లు, నివర్‌ తుపాను కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ.646 కోట్లను చెల్లిస్తున్నామని ఈ సందర్భంగా సిఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో సిఎం మాట్లాడుతూ..మూడో విడత రైతు భరోసాగా రూ.1,120 కోట్లు, నివర్ తుపాను పరిహారం కింద రూ.646 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లిస్తున్నామని అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సిఎం పేర్కొన్నారు. మొదటి నుంచి రైతుపక్షపాత ప్రభుత్వంగానే అడుగులు వేశామని ఆయన గుర్తు చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/