కర్బన ఉద్గారాల నియంత్రణ అవసరం

కాలుష్యం కారణంగా 26 శాతం మరణాలు

Air pollution
Air pollution

దేశంలో సంభవిస్తున్న అకాల మరణాల్లో దాదాపు 26 శాతం మరణాలు కాలుష్యం కారణంగా సంభవిస్తున్నవేనని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి.

వాయువు మాత్రమే కాదు ప్లాస్టిక్‌ రసాయన వ్యర్థాల కారణంగా నేలా నీరు కూడా కలుషితమవుతూ ప్రజారోగ్యానికి పెనువాసలుగా మారుతున్నాయి.

నానాటికీ పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమలు, పల్లెల్లో ఇంకా వంట కోసం కట్టెలు పిడకలు వాటం వంటి వన్నీ వాయుకాలుష్యాన్ని ప్రమాదకరమైన స్థాయికి చేరుస్తున్నాయి.

ఎరువులు, పురుగుమందులు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు పరిశ్రమల నుండి వెలువడే రసాయనిక వ్యర్థాలు నెలను, నీటిని కూడా కలుషితం చేస్తున్నాయి.

కాలుష్యంలేని చోటు భూతమలంతా వెతికినా దొరకదు అనంతగా పరిస్థితి నానాటికీ విషమిస్తోంది. దశాబ్దకాలంగా ప్రపంచవ్యాప్తంగా సగటు ఏడాదికి 1.5శాతం చొప్పున హరిత గృహవాయు ఉద్గారాల మోతాదు పెరిగింది.

భూగోళంపై సగటు ఉష్ణోగ్రతలు 1.1 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగి ప్రకృతి విపత్తులు సంభవిస్తుండటంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తున్నాయి. కర్బన ఉద్గారాల నియంత్రణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వాయు నాణ్యత పి.ఎం 2.5ను దాటి ఒక క్యూబిక్‌ మీటర్‌ ఒక మైక్రో గ్రామ్‌ పెరిగినా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవ్ఞతాయి.

వాయువుకాలుష్యం పెరుగుదలతో 0.14 శాతం హార్ట్‌ఫెల్యూర్స్‌ పెరుగుతున్నాయి.

కలుషిత వాయువు నుంచి వెలువడే నైట్రోజన్‌ ఆక్సైడ్‌, నైడ్రోజన్‌ మోనాక్సైడ్‌ అత్యంత ప్రమాదకరమైనవి.

ట్రాపికో కలుషిత వాయువ్ఞరూపంలో నైట్రోజన్‌ ఆక్సైడ్‌, నైట్రోజన్‌ మోన్సాక్సైడ్‌ వాతావరణంలోకి ప్రవేశిస్తున్నాయి.

ఈ రెండింటి ద్వారా దట్టమైన పొగ ఆమ్లవర్షం సంభవిస్తాయి.

నైట్రోజన్‌ ఆక్సైడ్‌ స్థాయిలు పెరిగిపోయి ఆస్మా, ఊపిరితిత్తులు దెబ్బతినడం, గుండెపోటు, ఊపిరితిత్తుల కేన్సర్‌ లాంటి ప్రమాదకర వ్యాధులు పెరుగుతాయి.

రవాణా, పరిశ్రమలు, బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తిరంగాలలో ఆరోగ్య ఎమర్జెన్సీని దృష్టిలో ఉంచుకుని కాలుష్యాన్ని తగ్గించేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాలి.

ప్రపంచసగటు ఉష్ణోగ్రతలు 3.4 నుంచి 3.9 డిగ్రీలకు పెచ్చరిల్లే ప్రమాదం ఉంది.

వాయుకాలుష్యం కారణంగా ఉబ్బసం, టిబి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు చర్మవ్యాధులు కంటి సమస్యలు, రోగ నిరోధకశక్తి క్షీణత వంటి సమస్యలతో జనం సతమతమవుతున్నారు.

వాయుకాలుష్యాన్ని బహిర్గం కావడం వల్ల సగటు ఆయుష్సు మూడు శతం మేర క్షీణిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

పట్టణ ప్రాంతాల్లో వాయుకాలుష్యానికి ఆటోల వంటి వాహనాల్లో వాడే కల్తీ ఇంధనం, విపరీతమైన ట్రాఫిక్‌ రద్దీ వాయుకాలుష్యానికి ప్రధాన కారణమవుతాయి.

కాలుష్యం తాకిడి నేట కూడా విలవిల్లాడుతుంది. కాలుష్యం దెబ్బకు విలువైన మట్టి సార్వం నాశనం అయిపోతోంది.

మట్టికాలుష్యం వ్యవసాయ ఉత్పాదకతకు, ఆహార భద్రతకు, మనుషుల ఆరోగ్యానికి ముప్పుగా మారుతోందని సాయిల్‌ పొల్యూషన్‌ రియాలిటీ నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.

మనదేశంలో నగరాల్లో ఏటా 10 కోట్ల టన్నులకుపైగా ఘనవ్యర్థాలు నేలమీదకు చేరుతున్నాయి.

రేపటి తరం మరిన్నిఇక్కట్లను ఎదుర్కోబోతోందని పలు సర్వేలు పేర్కొంటూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

ఆర్కిటిక్‌ ప్రాంతంలో మంచు వేగంగా కరుగుతూ ఉండటంతో త్వరలోనే నీటికి తీవ్ర కొరత ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

నగరాల్లో వాయు, నీటి కాలుష్యాలు ఇప్పటికే తీవ్రతరమవ్ఞతున్నాయి.

కర్బన ఉద్గారాల తీవ్రలకు కాలుష్యం శృతి మించుతోంది

ప్రతినగరంలోనూ ఢిల్లీ తరహాలో ఆక్సిజన్‌ చాంబర్లను ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి తప్పదేమో!

భూతాపం, విరుచుకుపడుతున్న విపత్తులు, వ్యాధుల విజృంభన, పౌష్టికాహారలోపం, దారిస్తున్నాయి. ప్రజలకు ఆహారభద్రతకు సవాళ్లు విసురుతున్నాయి.

కర్బన ఉద్గారాల నియంత్రణ నిబద్ధతతో కృషి చేయాలి. ఇంధన వినియోగ మార్పు, వినియోగపద్ధతుల్లో మార్పుల ద్వారా గుణాత్మక ఫలితాలను సాధించవచ్చును.

ఆచరణాత్మక కార్యక్రమాల ద్వారా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించి ఆర్థిక ఉద్దీపన చర్యలు చేపట్టడం ద్వారా నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవచ్చును.

  • ఆర్‌.వి.ఎం. సత్యం

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/