తగ్గిన ఒప్పో ఎ3ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరలు..

oppo A3S smartphone copy
oppo A3S smartphone

న్యుఢిల్లీ : ఒప్పో ఎ3ఎస్ 3జీబీ వేరియంట్ ధర తగ్గింది. ఈ ఏడాది జూలైలో 2జీబీ వేరియంట్‌ను విడుదల చేసిన ఒప్పో ఆగస్టులో 3జీబీ ర్యామ్ వేరియంట్‌ను తీసుకొచ్చింది. 6.2 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా, 4,230 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. 2జీబీ వేరియంట్ ధర రూ.10,990. 3జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.12,990. ఇప్పుడీ ధరను వెయ్యి రూపాయలు తగ్గించి రూ. 11,990కే అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్ ఇప్పటికే తగ్గించిన ధరతో విక్రయిస్తోంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ మాత్రం ఇదే వేరియంట్‌ను రూ. 10,990కే విక్రయిస్తుండడం విశేషం. కాగా, ఒప్పో ఎ3ఎస్ 2 జీబీ వేరియంట్ ధరను గత నెలలోనే వెయ్యి రూపాయలు తగ్గించి రూ. 9,990కే అందుబాటులోకి తీసుకొచ్చింది. 8.1 ఓరియో ఓఎస్, 6.2 అంగుళాల హెచ్‌డీ ప్లస్ సూపర్ ఫుల్ స్క్రీన్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ఎస్ఓసీ, 2జీబీ/3జీబీ ర్యామ్ వేరియంట్‌లు, 13 ఎంపీ+2 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 16 జీబీ, 32 జీబీ స్టోరేజీ వేరియంట్‌లు ఉన్నాయి.