కార్పొరేట్‌ పన్ను తగ్గింపునకు కేంద్రం సుముఖం!

GST
GST


న్యూఢిల్లీ: ప్రభుత్వం కార్పొరేట్‌ పన్నును 25శాతానికి తగ్గించేందుకు సుముఖంగా ఉందని,జిఎస్‌టి రాబడులు మెరుగుపడిన వెంటనే కార్పొరేట్‌పన్ను 25శాతానికి తగ్గిస్తామని వెల్లడించినట్లు ఫిక్కీ అద్యక్షుడు సందీప్‌ సోమాని వెల్లడించారు. 250 కోట్ల టర్నోవర్‌వరకూ ఉన్న సంస్థలకు 25శాతానికి అమలుచేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిసిన తర్వాత సోమాని మాట్లాడుతూ పారిశ్రామికరంగం ఎదుర్కొంటున్న అనేక అంశాలను మంత్రితో చర్చించామని, పన్నుల విధానం, ఉపాధి సృష్టి, పారిశ్రామిక ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన ప్రతిపాదనలను మంత్రితో చర్చించామని వెల్లడించారు. రాబడులు జిఎస్‌టిపరంగా పెరిగిన వెనువెంటనే పన్నుల వ్యవస్థను క్రమబదీకరిస్తామని, కార్పొరేట్‌ రంగానికి వచ్చే కొన్నేళ్లలోనే మంచి పలితాలు చూపిస్తామని వెల్లడించారని సోమాని చెప్పారు. 2015-16 బడ్జెట్‌లోప్రభుత్వం కార్పొరేట్‌ పన్నురేటును 30నుంచి 25శాతానికి వచ్చే నాలుగేళ్లలో తగ్గిస్తామని చెప్పిందన్నారు. అంతేకాకుండా ఈ తగ్గింపుతో కంపెనీలుకున్న మినహాయింపులను సైతం దశలవారీగా ఎత్తివేస్తారన్నారు. 2017 బడ్జెట్‌లోనే ప్రభుత్వం కార్పొరేట్‌ పన్నును 25శాతానికి తగ్గించింది. 50 కోట్లలోపు ఉన్న టర్నోవర్‌ సంస్థలకు 2015-16లో 25శాతాంగా నిర్ణయించింది. ఆ తదుపరి బడ్జెట్‌లో కార్పొరేట్‌ పన్నును 250 కోట్లటర్నోవర్‌వరకూ ఉన్న సంస్థలకు తగ్గించిందని అన్నారు.


సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos