మాంసాహారాన్ని తగ్గించండి

మాంసాహారాన్ని తగ్గించండి
Reduce carnivores

మీరు ఆరోగ్యవంతమైన మంచి ఆహారం తినకపోతే మీకు ఆరోగ్యవంతమైన శరీరం ఉండదన్నది యధార్థం. ప్రతీ యంత్రమూ, ప్రతీ జీవి తగిన శక్తిని పొందడానికీ, చక్కటి పరిస్థితిలో పనిచేయడానికీ, బతకడానికి అనువైన ఇంధనాన్నీ ఆహారాన్నీ కోరుతుంది. కొవ్ఞ్వ పట్టకుండా శరీరం పట్ల శ్రద్ధ తీసుకోండి. సన్నగా, ఆరోగ్యవంతంగా నాజూకుగానూ, పొట్టపెరగకుండానూ ఉండడం మేలు. బాగా వ్యాయామం చేయండి.

ప్రతీరోజూ మీ శరీరం అవే యంత్రం చురుకుగా, చక్కగా పనిచేయడానికి మొదలు పెట్టే రీతిని ఉంచుకోండి. కొవ్ఞ్వ అధికంగా ఉండే పదార్థాల్ని అన్నిటినీ తినకండి. చిప్స్‌, వేపుళ్లు, సాసేజ్‌, సలామీ లాంటి ప్రాసెస్‌ చేయబడ్డ మాంసపదార్థాలూ, జున్నూ, పాలతో చేయబడ్డ అనేక పదార్థాలూ ఇలాటివి. తీపి పదార్థాల్ని అధికంగా తినవద్దు. అలాగే కేకులూ, బిస్కెట్లూ, పంచదార కలిసిన తినుబండారాలూ కూడా ఇవన్నీ మీ దంతాలు శిథిలం కావడానికీ, మీ శరీరపు బరువ్ఞ పెరగడానికీ మూలం అవ్ఞతాయి. ఆహారంలో అధికంగా ఫైబర్‌ ఉండేలా చూసుకోండి. పండ్లు, కూరగాయాలు, గింజధాన్యాలు, పప్పుధాన్యం వీటిలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. భోజనం చేసే సమయంలో ఒక అరస్పూన్‌ వీట్‌ బ్రౌన్‌ వేసుకుని తొలి రెండు ముద్దలు తింటే చాలు. శరీర అవసరానికి ఫైబర్‌ లభిస్తుంది.

ఆకుకూరలు, కూరగాయలు మీ ఆహారంలో అధికంగా ఉండాలి. నూనెలతో వండే వంటలకన్నా, స్టీమ్‌పై కూరగాయల్ని ఉడికించి వండే వంటలు ఎంతో ఆరోగ్యం, వెజిటబుల్‌ సలాడ్స్‌, ఫ్రూట్‌ సలాడ్స్‌ నిత్యం ఆహారంలో ఉండి తీరేలా తగు జాగ్రత్తలు తీసుకోండి. తినే ఆహారం, తాగేనీరూ నియతాహారంగా ఉండాలి. శక్తికీ, పెరుగుదలకూ కార్బొహేడ్రేట్‌లూ, ప్రొటీన్‌లూ, కొవ్ఞ్వ పదార్థాలూ ముఖ్యమైనవి విటమిన్లు, ఖనిజ లవణాలూ, నీరు ఆహారానికి ఉపకరణాలు అధికంగా నార లేదా పీచు ఉన్న ఆహారాన్ని సమృద్ధిగా పళ్లనూ, కాయగూరలనూ, ధాన్యాలనూ మీ ఆహారంలో చేర్చుకోండి. తినేతిండిలో ఫైబర్‌ ఉన్న పదార్థాలు ఉండేలా జాగ్రత్తపడాలి.

పండ్లు, పచ్చికూరలు ఎంత ఎక్కువగా వాడితే అంత మంచిది. మాంసాహారులు చికెన్‌, మటన్‌లను తగ్గించుకుని, వారానికి 100నుంచి 200గ్రా. చేపలు తీసుకోవాలి. ప్రతి వ్యక్తి తన శరీరానికి అవసరమైన పోషక పదార్థాలను దృష్టియందు ఉంచుకుని తగిన మోతాదులో వివిధ పదార్థాలతో కూడిన ఆహారాన్ని భుజించాలి. కొవ్ఞ్వపదార్థాలు, పిండి పదార్థాలు సమృద్ధిగా కలిగి ఉండే ఆహారాలను శక్తినిచ్చే ఆహారం అంటారు. ధాన్యాలు, దుంపలు, ఎండి నపళ్లు, డ్రైఫ్రూట్స్‌, చక్కెర, బెల్లం, నెయ్యి వంటివి ఈ రకంలో ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా కలిగిన ఆహారాన్ని రక్షించే ఆహారం అంటారు. కూరగాయలు ముఖ్యంగా ఆకు కూరలు, పళ్లు ఈ రకంలో చేరాయి. వ్యక్తి వయస్సు పనిచేసే పరిస్థితులు మొదలైన విషయాలపై ఆ వ్యక్తి పౌష్టికాహారపు అవసరాలు ఆధారపడి ఉంటాయి.సాంప్రదాయ భారత ఆహారం గింజధాన్యాలతో నిండి ఉండేది. దంపుడు బియ్యం స్థానంలో నేడు బాయిల్డ్‌ రైస్‌ వచ్చి చేరాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/