ఢిల్లీ కి వచ్చే 25 విమానాల దారిమళ్లింపు

విమానాశ్రయం రన్‌వేపై భారీగా వర్షం నీరు

Delhi airport
Delhi airport

న్యూఢిల్లీ: ఢిల్లీలో గత రాత్రి కుంభవృష్టితో జనజీవనం అస్తవ్యస్తమయింది. రాత్రి 9 గంటలకు మొదలైన గాలివాన దాదాపు మూడు గంటలపాటు ఏకధాటిగా కొనసాగడంతో రాజధాని వాసులు తీవ్ర ఇబ్బందు ఎదుర్కొన్నారు. బలమైన గాలులకుతోడు వడగళ్లతో కూడిన వానవల్ల ఇబ్బందులు తప్పలేదు. పార్లమెంటు, కానిస్టిట్యూషన్‌ క్లబ్‌, లోథి రోడ్డు, ఆర్‌.కె.పురం తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. ప్రధాన రహదారుల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మరోవైపు ఢిల్లీ విమానాశ్రయం రన్‌వేపై భారీగా వర్షం నీరు నిలిచింది. దీంతో తాత్కాలికంగా రన్‌వేను మూసివేశారు. వివిధ ప్రాంతా నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చే 25 విమానాలను జోథ్‌పూర్‌, జైపూర్‌, లక్నో ఎయిర్‌ పోర్టులకు దారిమళ్లించారు. వర్షానికి తోడు హఠాత్తుగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం వణికిపోయారు. నిన్న ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 12.8 డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/