12 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం

Red Sandalwood
Red Sandalwood

కడప: చెన్నూరు మండలం దుగ్గనపల్లె వద్ద ఎర్రచందనం దుంగలను. టయోటా వ్యాన్‌లో తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మంచి నీటి కోసం దగ్గనపల్లె లోని ఒక ఇంటివద్ద కు దుండగులు చేరుకున్నారు. దొంగలని గుర్తించిన స్థానికులు వెంటనే ఒకరిని పట్టుకోవడంతో.. మిగిలిన నలుగురూ అక్కడి నుండి పరారయ్యారు. స్థానికులంతా కలిసి నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టి… నిందితుడి వద్ద నుండి టయోటా వాహనం, 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. అరెస్టయిన దుండగుడు తమిళనాడు కు చెందిన సెల్వపతి గా పోలీసులు గుర్తించారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/