రెడ్‌మీ 6ఎ ధరల తగ్గింపు

red me 6a
red me 6a
న్యూఢిల్లీ: రూపాయి క్షీణత కారణంగా చైనా మొబైల్ మేకర్ షావోమీ గత నెలలో రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ఎ స్మార్ట్‌ఫోన్ ధరలను పెంచింది. రెండింటి ధరలను రూ.600 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే, రెడ్‌మీ 6 3జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధరను మాత్రం పెంచకుండా అలాగే ఉంచింది. తాజాగా, ఇప్పుడు ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. రెడ్‌మీ 6ఎ అన్ని వేరియంట్ల ధరలను తగ్గించి పూర్వపు ధరలను ఫిక్స్ చేసింది. కాగా, షావోమీ ఇటీవలే పోకో ఎఫ్1 స్మార్ట్ ఫోన్ ధరను రూ.1000 తగ్గించింది. ఇప్పుడీ ఫోన్ రూ.19,999కే అందుబాటులో ఉంది.రెడ్‌మీ 6ఎ 2జీబీ ర్యామ్/16జీబీ స్టోరేజీ వేరియంట్‌ ఇప్పుడు రూ.5,999కే అందుబాటులోకి వచ్చింది. 2జీబీ ర్యామ్/32 జీబీ వేరియంట్ రూ.6,999కే అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ఇండియా, ఎంఐ.కామ్‌ల ద్వారా తగ్గింపు ధరలతో కొనుగోలు చేసుకోవచ్చు.