ఆస్ట్రేలియా ఓపెన్‌ నుంచి తప్పుకున్న బియాంక

Bianca Andreescu
Bianca Andreescu

పారిస్: గతేడాది యూఎస్‌ ఓపెన్‌ విజేత, కెనడా టెన్నిస్‌ స్టార్‌ బియాంక ఆండ్రీస్కు సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగింది. మోకాలి గాయం కారణంగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి వైదొలగుతున్నానని ఆండ్రీస్కు ప్రకటించింది. చైనాలోని షెన్‌జెన్‌లో జరిగిన సీజన్ఎండింగ్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో ఆమె మోకాలికి గాయమైంది. ‘నేను మెల్‌బోర్న్‌లో ఆడడానికి ఇష్టపడుతున్నా. కానీ.. గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఇది చాలా కఠినమైన నిర్ణయం. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడడం లేదు. నా పునరావాసం బాగా జరుగుతోంది. చికిత్స తీసుకొంటున్నా. నా ఆరోగ్యం రోజురోజుకూ మెరుగుపడుతోంది. అయితే, పూర్తిగా కోలుకునేందుకు కొంచెం సమయం పడుతుంది’ అని 19 ఏళ్ల బియాంక ట్వీట్‌ చేసింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/