బాలాపూర్ లడ్డూ గత రికార్డు ను బ్రేక్ చేసిన మాదాపూర్ లడ్డు
గణేష్ నవరాత్రుల్లో లడ్డు అనేది చాల ప్రత్యేకమైంది..విశేషమైనది. తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న ఈ లడ్డు చాల మహిమగలది. అందుకే ఈ లడ్డు ను దక్కించుకునేందుకు భక్తులు పోటీపడతారు. లక్షలు పెట్టి మరి వేలంపాటలో లడ్డును దక్కించుకుంటారు. అయితే గణేష్ లడ్డు వేలంపాట అంటే అందరికి బాలాపూర్ లడ్డునే గుర్తువస్తుంది. ఏడాది ఏడాదికి ఇక్కడ లడ్డు ధర పెరుగుతుంటుంది. ఇక ఈసారి ఎంత పలుకుతుందనేది చూడాలి.
ఇదిలా ఉంటె తాజాగా మాదాపూర్ మై హోమ్ భుజా అపార్ట్మెంట్ గణేశ్ మండపంలో నిర్వహించిన వేలంపాటలో లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది. ఏకంగా బాలాపూర్ లడ్డూ గత రికార్డునే బ్రేక్ చేసింది. ఎవరూ ఊహించని రీతిలో రూ.20.50 లక్షలకు మైహోమ్ భుజాలో ఉంటున్న సత్తిబాబు అనే వ్యక్తి లడ్డూను దక్కించుకున్నారు. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి రేపు జరగనున్న బాలాపూర్ లడ్డూ వేలంపాటపై పడింది. అయితే ఈ ధరను బాలాపూర్ లడ్డూ బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి మరి.