17వ లోక్‌సభలో 78 మంది మహిళా ఎంపీలు

న్యూఢిల్లీ: కొత్త లోక్‌సభ కొలువు తీరుతున్న తరుణంలో మహిళా ప్రాతినిధ్యం పెరుగుతూ వస్తుంది. మొత్తం సభ్యుల సంఖ్యలో 14 శాతం వాటాతో 78 మంది మహిళా ఎంపిలు పార్లమెంటులో కొలువుదీరనున్నారు. మహిళా శక్తి పెరుగుతున్నా రిజర్వేషన్ బిల్లు ఆమోదం మాత్రం అంతకంతా దూరమవుతుందనడంలో అతిశయోక్తి లేదు. 542 మంది సభ్యులతో 17వ లోక్‌సభ కొలువుదీరనుంది. దిగువ సభ కొలువుదీరే క్రమంలో 78(14శాతం) మంది మహిళా ఎంపీలు పార్లమెంటు మెట్లెక్కుతున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 62 మంది మహిళా ఎంపీలు గెలుపొందారు. 1952 నుంచి మహిళా ఎంపీల ప్రాతినిధ్యం పెరుగుతున్నా..33 శాతం రిజర్వేషన్‌కు మాత్రం నోచుకోవట్లేదు. అది మహిళలకు ద్రాక్షేనని మహిళా ప్రతినిధులు వాపోతున్నారు.
దేశవ్యాప్తంగా 41 మంది సిట్టింగ్ ఎంపీలు పోటీ పడగా వారిలో 28 మంది మాత్రమే విజయ కేతనం ఎగురవేశారు. ఏపిలో అనకాపల్లి(భీశెట్టి వెంకట సత్యవతి), అరకు(గోడ్డేటి మాధవి), కాకినాడ(వంగా గీత), అమలాపురం(చింతా అనురాధ)..తెలంగాణలో మహబూబూబాద్(మాలోతు కవిత) స్థానాల నుంచి తెలుగు మహిళలు పార్లమెంటులో కొలువుదీరనున్నారు.
తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/