ప్రపంచ దేశాలకు తాలిబన్ల హెచ్చరిక

న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్‌ నుంచి ఏ ముప్పు రావొద్దంటే తమను అధికారికంగా గుర్తించాలని తాలిబన్లు అంతర్జాతీయ సమాజాన్ని హెచ్చరించారు. ‘అఫ్గాన్‌ నుంచి ఏ దేశానికైనా, ఎలాంటి ముప్పు ఎదురైనా.. ఆ దేశం తాలిబన్లను అధికారికంగా గుర్తించనంత వరకు మేం ఎలాంటి బాధ్యత వహించబోమ’ని పేర్కొన్నారు. తాలిబన్లను గుర్తించకపోతే ప్రపంచం అంతటికీ సమస్యలు వస్తాయని హెచ్చరించారు.

అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకొని రెండు నెలలు గడిచింది. ఇప్పటివరకు చైనా, పాకిస్థాన్‌ తప్ప తాలిబన్లతో ద్వైపాక్షిక సంబంధాలకు ఏ దేశం ఆసక్తి చూపలేదు. కాగా, తాలిబన్‌ సుప్రీం లీడర్‌ హైబతుల్లా అఖూంజాదా శనివారం కాందహార్‌లోని ఓ మదర్సాను సందర్శించారు. దీనికి సంబంధించి ఎలాంటి ఫొటోలు బయటకురాలేదు. రెండు నెలలుగా హైబతుల్లా కనిపించలేదు. ఆయన చనిపోయి ఉంటారన్న వార్తలు కూడా వచ్చాయి.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/